Pawan Kalyan: ఎంపీడీవో జవహర్‌బాబును పరామర్శించనున్న పవన్..! 8 d ago
కడప జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటించనున్నారు. ఎంపీడీఓ జవహర్ బాబుపై జరిగిన దాడి ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. శనివారం, కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును పవన్ పరామర్శించనున్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు.